Prabhas : ఆ బాధను భరించలేకపోతున్న ప్రభాస్.. కారణం అదే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. మోకాలి గాయం కారణంగా 'సలార్' విడుదలకు ముందు ప్రభాస్ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అందుకోసం ఆయన యూరప్ కూడా వెళ్లొచ్చారు. చికిత్స చేయించుకున్న తర్వాత అక్కడే నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ జోష్‌తో కనిపించడంతో మోకాలి నొప్పి నుంచి కోలుకున్నాడని అందరూ అనుకున్నారు.
తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ప్రభాస్‌ను చూస్తుంటే ఓ అనుమానం కలగక మానదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అక్కడ ప్రభాస్, దిశా పటానిపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఆ షూటింగ్ సెట్ నుంచి ఏదొక ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూనే ఉంది.
ప్రభాస్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ నుంచి దిగుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ప్రభాస్ చాలా ఇబ్బందిగా, జాగ్రత్తగా ఫ్లైట్ దిగుతున్నట్లు అనిపిస్తోంది. మామూలుగా స్టైల్‌గా నడుచుకుని వచ్చే ప్రభాస్ అలా రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్‌కి ఇంకా మోకాలి నొప్పి తగ్గినట్లు లేదని పలువురు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవంగా ప్రభాస్ మోకాలి సమస్యకు కొంచెం ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందట. కానీ ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం, కమిట్‌మెంట్స్ కోసం నొప్పిని భరిస్తూ షూటింగ్స్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Very chic & Stylish
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) March 10, 2024
-#Prabhas#Kalki2898AD pic.twitter.com/dR1ull4koP