శ్రీజ, కల్యాణ్ దేవ్ విడాకులు.. ఇన్స్టా పోస్ట్తో క్లారిటీ ఇచ్చేసినట్లేనా..?

Update: 2023-06-18 06:36 GMT

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని దూరంగా ఉంటున్నారని పుకార్లు షికారు చేశాయి. ఇందుకు తగ్గట్లుగానే శ్రీజ, కల్యాణ్ దేవ్లు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అటు మెగా ఫ్యామిలీగానీ, ఇటు కల్యాణ్ దేవ్ గానీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా కల్యాణ్ దేవ్ చేసిన ఇన్ స్టా పోస్ట్తో డైవోర్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. వారిద్దరూ ఇప్పటికే విడాకులు తీసేసుకున్నారంటూ నెటిజన్లు అంటున్నారు.

కల్యాణ్ దేవ్ తాజాగా తన కుమార్తె నవిష్కతో దిగిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు ఇవే అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు ఫ్యామిలీ కోర్ట్ అరుదైన సందర్భాల్లో తప్పిస్తే 18ఏండ్లలోపు పిల్లల సంరక్షణ బాధ్యతల్ని తల్లికే అప్పగిస్తుంది. అయితే వారంలో ఓ రోజు తండ్రి వారితో గడిపేలా రూల్స్ పాస్ చేస్తుంటుంది. కల్యాణ్ దేవ్ పోస్ట్‌ను గమనిస్తే కోర్టు ఆర్డర్స్ మేరకు అతను కూతురు నవిష్కతో వారానికి 4 గంటలు మాత్రమే గడుపుతున్నట్లు అర్థమవుతోంది.

కొన్నాళ్ల క్రితం శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కళ్యాణ్ దేవ్ నేమ్ రిమూవ్ చేయడంతో వారిద్దరి డైవోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ కల్యాణ్ దేవ్ కనిపించలేదు. కేవలం శ్రీజ మాత్రమే వాటికి అటెండ్ కావడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. డైవోర్స్ వార్తలు వచ్చాక కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన 2 సినిమాలు సూపర్ మచ్చి, కిన్నెరసాని రిలీజ్ అయ్యాయి. ఆ మూవీలకు మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. మరోవైపు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నవిష్కతో దిగిన ఫోటోలు షేర్ చేస్తున్న కల్యాణ్ దేవ్.. తాజా పోస్ట్‌తో పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్లే అని నెటిజన్స్ అంటున్నారు.

Tags:    

Similar News