కళ్యాణ్ రామ్ కొత్త సినిమా.. బాలయ్య రేంజ్ మాస్ యాక్షన్

Update: 2023-07-06 02:00 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. బింబిసార సినిమా హిట్ తర్వాత వేగం పెంచిన కళ్యాణ్ రామ్.. రీసెంట్ గా డెవిల్ సినిమా టీజర్ ను విడుదల చేశాడు. ఆడియన్స్ నుంచి మంచి టాక్ అందుకున్న డెవిల్ త్వరలో రిలీజ్ కు రెడీ అయింది. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినమా #NKR21 పోస్టర్ ను అనౌన్స్ చేశారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారు. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కు 21వ సినిమా కాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. చేతికి కట్టు, రక్తం కారుతున్న ఈ పోస్టర్ చూస్తుంటే.. బోయపాటి, బాలయ్య రేంజ్ మాస్ యాక్షన్ లా ఉండబోతున్నట్లు కనిపిస్తుంది.




 


అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ మూవీ.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తాడని చిత్ర బృందం తెలిపింది.



Tags:    

Similar News