'భారతీయుడు2' గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన కమల్ హాసన్

Byline :  Shabarish
Update: 2024-03-25 07:11 GMT

'విక్రమ్' మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో శంకర్ దర్వకత్వంలో వచ్చిన భారతీయుడు సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు భారతీయుడు2 తీస్తున్నారు. ఇండియన్2 సినిమా ఆల్రెడీ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ఇండియన్3 కూడా ఉంటుందట.

తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీపై షాకింగ్ విషయం చెప్పాడు. ఆల్రెడీ ఇండియన్2 మూవీ షూటింగ్ పూర్తయ్యిందని తెలిపారు. అంతేకాదు ఆ మూవీతో పాటు ఇండియన్3 కూడా షూట్ కంప్లీట్ చేసేశారట. తాను తీసే 'థగ్ లైఫ్' సినిమా షూట్ ఎన్నికల తర్వాత స్టార్ట్ అవుతుందని, ఎన్నికలు అయ్యాక ఇండియన్2 రిలీజ్ ఉంటుందని కమల్ చెప్పారు.

ఒకేసారి రెండు సినిమాల షూట్స్ ఫినిష్ చేశామని కమల్ చెప్పడంతో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. మొత్తానికి ఇండియన్2, ఇండియన్3 మూవీస్ గురించి షాకింగ్ న్యూస్ చెప్పావ్ భయ్యా అంటూ కమల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న కమల్ హాసన్..ఇండియన్2తో రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.




Tags:    

Similar News