'ఇండియా ఈజ్ ఇందిరా.. ఇందిరా ఈజ్ ఇండియా'.. ‘ఎమర్జెన్సీ’ టీజర్ చూశారా?

Update: 2023-06-25 06:57 GMT

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా తీసింది కంగనా. ఇందులో ఆమె అప్పటి ప్రధాన మంత్రి, దివంగత ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం‌తో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. శనివారం ఈ మూవీ నుంచి “ప్రొటెక్టరా లేదా డిక్టెటరా? సొంత ప్రజల‌పై మన దేశ నాయకురాలు యుద్ధం ప్రకటించినప్పటి చీకటి రోజులకు సాక్ష్యమిది. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది” అనే క్యాప్షన్‍తో హిందీ టీజర్‌ను తన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది కంగనా రనౌత్.

టీజర్​లో 'ఇండియా ఈజ్ ఇందిరా.. ఇందిరా ఈజ్ ఇండియా' అన్న డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది. మణికర్ణిక ఫిలిమ్స్​ బ్యానర్​పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలోని ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించారు కంగనా. ఈ సినిమాతో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని దాదాపు 48 ఏళ్ల తర్వాత ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారు కంగనా. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఏర్పడడం 'మన చరిత్రలో అది ఓ చీకటి దశ' అని పేర్కొన్నారు.

Full View


Tags:    

Similar News