హైకోర్టును ఆశ్రయించిన కన్నడ స్టార్ ఉపేంద్ర..

Update: 2023-08-17 05:47 GMT

వింత పాత్రలు, విలక్షణ నటనతో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. తన సినిమాలు బోల్తా కొడుతుండడంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఓ పార్టీ పెట్టి చట్టసభలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. అయినా సరే తన పార్టీ పేరుతో హల్‌చల్ చేస్తుంటాడు. రీల్ లైఫ్‌కు రియల్ లైఫ్‌కు తేడా తెలియకుండా రెచ్చిపోతుంటాడు. తాజాగా అలాగే రెచ్చిపోయి చిక్కుల్లో పడ్డాడు. దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్నాటకలో తీవ్ర దుమారం రేపాయి. పలుచోట్ల పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.




 


ఈ క్రమంలోనే ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. చెన్నమ్మనకెరె అచ్చుకట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్పై కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది. మిగితా స్టేషన్లలో మాత్రం కేసులు అలాగే ఉన్నాయి. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉపేంద్ర తరుపున ఆయన అడ్వకేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏం అన్నారంటే..

తన పార్టీ ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’పై వస్తున్న విమర్శలకు ఉపేంద్ర సోషల్ మీడియాలో లైవ్‌లో సమాధానాలు చెబుతూ మాట తూలాడు. ‘‘ఒక మంచిపని చేస్తుంటే విమర్శించేవారు చాలా మందే ఉంటారు. ఒక ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉన్నట్లు వీరు కూడా ఉంటారు. వీరి విమర్శలు పట్టించుకోకూడదు. వీరి కామెంట్లను చదవకూడదు. మంచి హృదయాలతోనే మార్పు వస్తుంది’’ అని ఉపేంద్ర అన్నాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉపేంద్ర క్షమాపణ చెప్పాలంటూ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళనకారులు ఉపేంద్ర పోస్టర్లను కాల్చేశారు. దీంతో యాంగ్రీ యాక్టర్ దిగొచ్చి సారీ చెప్పాడు. తను తప్పుగా మాట్లాడానని, హృదయపూర్వక క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. 




Tags:    

Similar News