19 రోజుల్లో వెడ్డింగ్ యానివర్సరీ..ఇంతలోనే గుండె పగిలే వార్త

Update: 2023-08-07 10:21 GMT

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఫేమస్ యాక్టర్ విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన హార్ట్ అటాక్‎తో మరణించారు. స్పందన హఠాన్మరణంతో విజయ్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. రీసెంట్‎గా తన స్నేహితులతో కలిసి బ్యాంకాక్ టూర్ వెళ్లింది. టూర్‎లో ఉండగానే సడెన్‎గా హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినా..ఫలితం లేకపోయింది. సోమవారం ఉదగం ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. విజయ్ భార్య మరణాన్ని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. చాలా మంది విజయ్ ఆప్తులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు సైతం విజయ్ కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా సానుభూతిని తెలియజేశారు.




 


బెంగళూరు పోలీస్‌ ఆఫీసర్ బీకే శివరామ్‌ కూతురు స్పందన . హీరో విజయ్ రాఘవేంద్ర, స్పందనలు చాలా కాలం ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2007లో జరిగింది. వీరిద్దరికి ఓ కొడుకు ఉన్నాడు. పెళ్లైన తర్వాత స్పందన 2016లో ‘అపూర్వ’ అనే కన్నడ మూవీలో అతిథి పాత్రలో మెరిశారు స్పందన. ఈ మధ్యనే స్నేహితులతో కలిసి బ్యాంకాక్ టూర్‌కు వెళ్లిన స్పందన సోమవారం హార్ట్ ఎటాక్‎తో మరణించారు. ఇదిలా ఉంటే మరో 19 రోజుల్లో స్పందన-విజయ్‌ల వెడ్డింగ్ యానివర్సరీ జరగనుంది. ఇంతలోనే ఆమె చెందడం హఠాన్మరణం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.




 


విజయ్ కుటుంబ సభ్యులు స్పందన డెడ్ బాడీని బ్యాంకాక్‌ నుంచి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం బెంగళూరులోనే ఆమె అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది. స్పందన మరణవార్త తెలుసుకున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌‎లు సైతం సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు సానుభూతిని తెలిపారు.





Tags:    

Similar News