మహేశ్‌-పవన్‌ల గురించి కన్నడ స్టార్ హీరో ఏమన్నారంటే..

By :  Aruna
Update: 2023-09-29 11:02 GMT

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయనకు కన్నడ, తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రజనీకాంత్‌ జైలర్ మూవీలో శివన్న పాత్రలో మాస్ లుక్‎లో కనిపించి తన నటనతో మెస్మరైజ్ చేశారు. తాజాగా శివ రాజ్‎కుమార్ తన ఫ్యాన్స్‎తో ట్విటర్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ స్టార్ హీరోలు మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ల గురించి తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అంతే కాదు గతంల వీరిద్దరితో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట్లో షేర్‌ చేశారు.

" మహేశ్ బాబు చాలా సాఫ్ట్. తక్కువగా మాట్లాడతాడు. తన ప్రొఫెషన్‎ని ఎంతగానో ప్రేమిస్తాడు. స్టార్ హీరో అయినప్పటికీ అందరితో ఎంతో గౌరవంగా ఉంటాడు. మహేశ్ నటన తెరపై చూడడం ఎంతో సంతోషంగా ఉంటుంది. తనకెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటాను. ఇక పవన్‌ కళ్యాన్ నాకు మంచి మిత్రుడు. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఆతను వెళ్తున్న దారిలో సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌లను అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

శివ రాజ్‌‎కుమార్‌ ప్రస్తుతం ‘ఘోస్ట్‌’ మూవీలో నటిస్తున్నారు. శ్రీని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సందేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో ఒకేసారి అక్టోబర్‌ 19న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ యాక్టర్ అనుపమ్‌ ఖేర్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఘోస్ట్ తెలుగు ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అక్టోబర్‌1న రిలీజ్ చేయనున్నారు.



Tags:    

Similar News