సంక్రాంతి అంటేనే ప్రతి ఇంటా పండగ వాతావరణం నెలకొంటుంది. అలాగే భారీ సినిమాల పండగ కూడా ఉంటుంది. సంక్రాంతి పండగకు పెద్ద పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉంటాయి. నిర్మాతలు కూడా పోటీపడిమరీ తమ సినిమాను విడుదల చేయాలని చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ విశ్వంభర కూడా అప్పుడే రిలీజ్ కానుంది. తాజాగా మెగాస్టార్ మూవీతో పోటీపడేందుకు మరో మూవీ కూడా బరిలో నిలవనుంది.
గత ఏడాది బారీ విజయాన్ని అందుకున్న కాంతారా మూవీకి ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన కాంతారా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని చెప్పాలి. అలాంటి మూవీకి ప్రీక్వెల్ వస్తుందని తెలియగానే ఫ్యాన్స్ అందరూ థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు.
కాంతారా2ను సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు. అయితే ఆ సమయంలోనే విశ్వంభర కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు డివోషనల్ కంటెంట్‌తోనే వస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ మూవీ గెలవనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.