బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కరణ్ జోహార్ కొత్తగా మొదలైన మైక్రో బ్లాగింగ్ యాప్ థ్రెడ్ లో ఓ నెటిజన్ కు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు. నెటిజన్ అడిగిన ప్రశ్న, కరణ్ జవాబు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.బాలీవుడ్ స్టార్ కిడ్స్ కు లాంచింగ్ ఇవ్వడంలో కరణ్ జోహార్ ఫేమస్. అంతేకాదు కాఫీ విత్ కరణ్ తోనూ, హోస్టింగ్ తోనూ కూడా అతను పాపులారిటీ సంపాదించుకున్నాడు. అడల్ట్ క్వశ్చన్స్ తో స్టార్స్ ను ఆటాడుకునే కరణ్ ను కొత్తగా మొదలైన థ్రెడ్ యాప్ లో ఓ వ్యక్తి పర్శనల్ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. అయితే దానికి కరణ్ ఇబ్బంది పడలేదు సరికదా...అతనికి షాకింగ్ ఆన్సర్ కూడా ఇచ్చాడు.
థ్రెడ్స్ లో కరణ్ ఖాతా ఓపెన్ చేశారు. అందులో ఆస్క్ కరణ్ ఎనీథింగ్ సెషన్ ను నిర్వహించారు. 10 నిమిషాల పాటు అందుబాటులో ఉంటానని తనను ఏవైనా ప్రశ్నలు అడగొచ్చని ప్రకటించాడు. దీంతో చాలామంది కరణ్ ను ప్రశ్నలు అడిగారు. అందులోనే ఒక నెటిజన్ మీరు గే కదా... నిజమేనా అని ప్రశ్నించాడు. దానికి కరణ్ "నీకు ఇంట్రెస్ట్ ఉందా..?" అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. కరణ్ ఇంత బోల్డ్ గా సమాధానం ఇవ్వడం వైరల్ అయింది. ఈ ఆన్సర్ నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఏడేళ్ళ తర్వాత కరణ్ డైరెక్ట్ చేసిన రాఖీ ఔర్ రాణి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రణబీర్, ఆలియా భట్ నటించిన ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతోంది.