అప్పుడూ ఇప్పుడూ దిల్ రాజే.. మరి రిజల్ట్

Update: 2024-01-03 11:46 GMT

చిన్న సినిమా పెద్ద సినిమా.. దీని అర్థం ఏంటీ.. ఏం లేదు. ఏ సినిమా వెనక ఎంతమంది పెద్దలు ఉన్నారు అనేది పెద్ద సినిమా. ఏ సినిమాకు పెద్దగా అండ లేదు అనేది చిన్న సినిమా. ఒకప్పుడు అర్థం ఎలా ఉన్నా.. ఇప్పటి అర్థం అయితే ఇదే. ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురు అనే మాట కొన్నాళ్లుగా వినిపించడం లేదు. కానీ వినిపించకుండానే శాసిస్తున్నారు వాళ్లు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి.. ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇవ్వాలి.. ఎవరిని తగ్గమని బెదిరించాలి.. ఎవరి సినిమాను వాయిదా వేసుకోమని బ్లాక్ మెయిల్ చేయాలి అనేది ఆ నలుగురు లేదా ఐదుగురి చేతుల్లోనే ఉంది. ఈ ఐదుగురికి దగ్గరగా ఉన్న నిర్మాతలు తీసినవే ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే. ఎందుకో బలమైన కంటెంట్ ఉన్న సినిమాలంటే వీరికి భయం. తమతో పాటు వాళ్లు రావడానికి ఇష్టపడరు. అందుకే బలవంతంగా వాయిదా వేయిస్తుంటారు. అందుకోసం ఏమైనా చేస్తారు.. ఇందుకు సరైన ఉదాహరణ తాజాగా హను మాన్ మూవీ కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ తోనే బిగ్ స్పాన్ ఉన్న సినిమా అని అర్థమైంది. పైగా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగుతో కలిపి 1700లక పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం అని చెబుతున్నారు. ఒక చిన్న సినిమా ఆ రేంజ్ కు వెళ్లిందనే ఆనందం కంటే ఆ సినిమా మాకు పోటీగా ఎక్కడ వస్తుందో అన్న భయమే ప్రస్తుతం ఆ కొందరినీ ఇబ్బంది పెడుతోంది. అందుకే హను మాన్ ను వాయిదా వేయాలని బెదిరిస్తున్నారు అనే వార్తలు రోజూ వస్తున్నాయి. ఇదే పదం ఇలాగే వాడకపోయినా.. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా చెబుతూనే వస్తున్నారు. దీని వెనక ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న ఒక పెద్ద నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు అనేది నిజం. ఈయనే 2022లో నిఖిల్ కార్తికేయ2ను ఇలాగే చేశాడు.

నిఖిల్ కార్తికేయ2ను ఆగస్ట్ 5న విడుదల చేయాలనుకున్నారు. అదే రోజు కళ్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సాల్మన్ సీతారామం సినిమాలున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలను కాదని కేవల నిఖిల్ సినిమానే టార్గెట్ చేశారు. అతన్ని పోస్ట్ పోన్ చేసుకోమని చాలా చాలా ఇబ్బంది పెట్టారు. కళ్యాణ్ రామ్ కు నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉంది. సీతారామం అశ్వనీదత్ సినిమా. కాబట్టి వీరి బలం ఎక్కువ. బలహీనమైన నిఖిల్ సినిమాను ఫోర్స్ చేశారు. భయపెట్టారు. బాధపెట్టారు. చివరికి కార్తికేయ 2ను ఆగస్ట్ 12న విడుదల చేయాలనుకుంటే ఆ రోజూ ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు.ఆగస్ట్ 12న నితిన్ మాచర్ల నియోజకవర్గం ఉందని ఇబ్బంది పెట్టారు. దీంతో వీళ్లు 13న విడుదల చేశారు. కానీ బింబిసార, సీతారామంకు మించి ప్యాన్ ఇండియన్ రేంజ్ లో కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్ అయింది. మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ అయింది. కార్తికేయ2 శ్రీ కృష్ణుడి మీద తీసిన సినిమా. ఇప్పుడు మరోసారి అదే ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ చిన్న వాళ్లు అని హను మాన్ టీమ్ ను ఇబ్బంది పెడుతున్నారు. జనవరి 12న హను మాన్ కు థియేటర్సే లేకుండా హైదరాబాద్ లో మొదటి రోజు ఏకంగా 90 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను బ్లాక్ చేశాడు దిల్ రాజు. ఈ బ్లాకింగ్ అంతా గుంటూరు కారం కోసమే. వీళ్లే 90 థియేటర్స్ లాగేసుకుంటే మిగిలేవి పది కూడా ఉండవు. ఆ పది థియేటర్లనూ పంచుకునేందుకు డబ్బింగ్ సినిమాలున్నాయి. అంటే హను మాన్ కు మొదటి రోజు హైదరాబాద్ లో వసూళ్లే ఉండవు. తమ మాట విననందుకు దిల్ రాజు, హారిక హాసిని బ్యానర్ తో పాటు మిగిలిన ఆ టీమ్ చేసిన పని ఇది.

కానీ ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ చూస్తే గుంటూరు కారంలో పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. అయినా హను మాన్ కేవలం తెలుగులో మాత్రమే విడుదలైతే ఆపొచ్చు. కానీ నార్త్ లో ఈ చిత్రానికి 1500 థియేటర్స్ బుక్ అయి ఉన్నాయి. ఇక్కడ ఆపితే అక్కడ పెద్ద మొత్తంలో సమస్య అవుతుందని తెలిసి కూడా భయపెడుతూ బాధపెడుతున్నారంటే.. ఇండస్ట్రీలో ఎవరి చేతుల్లో ఉందో.. ఎవరి అదుపాజ్ఞల్లో సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. అందుకే కొత్త నిర్మాతలు అంటారు. ఇక్కడ సినిమా తీయడం సులువే.. కానీ రిలీజ్ చేయడమే పెద్ద టాస్క్ అని.

ఏదేమైనా కార్తికేయ2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయి శ్రీ కృష్ణుడి సత్తాను చాటింది. ఇప్పుడు హను మాన్ వంతు. రిజల్ట్ రిపీట్ అయితే దేశంలో రామ మందిర ప్రారంభం అనే హడావిడీ కూడా ఉంది కాబట్టి.. హను మాన్ దెబ్బకు దేశవ్యాప్తంగా బాక్సాఫీసులు షేక్ అవడం ఖాయం.

Similar News