టాలీవుడ్‌లో పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆనాటి మూగమనసుల నుంచి.. రామ్ చరణ్ నటించిన మగధీర, రెండేళ్ల క్రితం వచ్చిన శ్యామ్‌సింగరాయ్ వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా పునర్జన్మల నేపథ్యంలో వస్తున్న మరో తెలుగు మూవీ కౌశిక్ వర్మ దమయంతి రిలీజ్‌కి రెడి అయింది.
హీరో విశ్వజిత్ స్వీయ దర్శకత్వంలో గరుదత్త క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై గీతా పావని నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. అర్చనా సింగ్, ఊర్వశీ రాయ్ హీరోయిన్లుగా.. రఘు దీప్, సునీత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హేమచంద్ర పాడిన ‘పదరా పదరా వేటకు వెళ్దాం..’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
వందల ఏళ్ల క్రితం జరిగిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరి విషాదాంతంగా ముగిసి.. ప్రస్తుత కాలంలో మళ్లీ పుట్టిన ఆ ముగ్గురిలో తమ ప్రేమను ఎవరు గెలిపించుకున్నారు, ఎవరు పంతం నెగ్గించుకున్నారనేదే స్టోరీ. భావోద్వేగాలతో నడిచే ఈ సినిమాలో హీరోహీరోయిన్లు పాత్రలు కీలకం కానున్నాయి హీరో విశ్వజిత్ ఓ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాకు ఎస్ఎస్ ఆత్రేయ, యెలేందర్, మహావీర్ సంగీతం అందించారు. వంశీ రెడ్డి, పవన్ లు ఎడిటర్లు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఈ సినిమా జూన్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.