డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..

Byline :  Krishna
Update: 2023-09-01 13:03 GMT

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టైన వెంకట్‌ అక్రమాలపై నార్కోటిక్ బ్యూరో ఆరా తీస్తోంది. వెంకట్పై తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలకు పాల్పడ్డారు. నిర్మాతలు సి. కల్యాణ్‌, రమేష్‌ల నుంచి రూ.30 లక్షలకుపైగా వసూల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అతడి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

నలుగురు డ్రగ్స్ పెడ్లర్స్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ముగ్గురు నైజీరియన్స్ ఉన్నారు. రిమాండ్ రిపోర్టులో 18మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు సమాచారం. వెంకట్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయించినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. రామ్ చంద్, సుశాంత్ రెడ్డి, కలహర్ రెడ్డి, ఉప్పలపాటి రవి, శ్వేత, రామ్ కుమార్, కార్తిక్, సూర్య, ఇంద్ర తేజ, నర్సింగ్, అజీమ్, అహ్మద్ వంటి వారి పేర్లు ఉన్నాయి.

వెంకట్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారిని ప్రశ్నించే యోచనలో పోలీసులు ఉన్నారు. సెలబ్రెటీలకు వెంకట్ తరుచూ పార్టీలు ఇచ్చేవారని గుర్తించారు. వెంకట్ పెళ్లి పేరుతోనూ యువతుల్ని మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సినిమాల్లో అవకాశాల పేరుతో కొందరి యువతుల్ని తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించినట్లు సమాచారం.


Tags:    

Similar News