కేజీఎఫ్ హీరోయిన్ పెళ్లి చేసుకుందా? దాని అర్థం ఏమిటి?

Update: 2023-07-18 02:50 GMT

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు. సినిమాలో భాగమైన అందరికీ పేరొచ్చింది. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఆలియండియా క్రేజ్ వచ్చింది. తర్వాత మంచి సినిమాలు పడకపోవడంతో ప్రస్తుతానికి సోసోగానే ఉంది కెరీర్. ఆమె ఎవరితోనో ప్రేమలో పడిందని, పెళ్లి కూడా చేసుకుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా శ్రీనిధి సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఫొటోలతో పెళ్లి కబురు నిజమేనని అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరైతే మరీ అంత దొంగ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నీ భర్తను కూడా చూపించు అని డిమాండ్ చేస్తున్నారు.

ఆమె ఫొటోల్లో నుదుట కుంకుమ ధరించి కనిపించడమే దీనికి కారణం. పెళ్లయిన వాళ్లే నుదుట సిందూరం పెట్టుకునే సంప్రదాయం ఉండడంతో ఆమె కూడా పెళ్లాడిందని జనం అనుకున్నారు. ఆమె వీరాభిమానులు కొందరు మరింత ఆరా తీసి అవన్నీ పుకార్లేనని తేల్చారు. శ్రీనిధి కర్నాటకలోని తుళు కుటుంబంలో జన్మించిందని, తుళు కులాల ఆచారం ప్రకారం పెళ్లికాని యువతులు కూడా పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారని చెప్పారు. ఆమె ఏదైనా శుభకార్యంలో అలా సిందూరం పెట్టుకుని ఉండొచ్చని, పెళ్లి చేసుకోలేదని చెబుతున్నారు. దీంతో పెళ్లి వార్తలకు తెరపడింది. 32 ఏళ్ల శ్రీనిధి వాణిజ్య ప్రకటనలతో కెరీర్ మొదలుపెట్టింది. కేజీఎఫ్ హిట్ కావడంతో పారితోషికం భారీగా పెంచిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె విక్రమ్‌తో జతకట్టిన ‘కోబ్రా’ మూవీ సరిగ్గా ఆడకపోవడంతో నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదట.

Tags:    

Similar News