కేజీఎఫ్-2 రిలీజై ఏడాది గడిచినా.. ఇప్పటివరకు యష్ తర్వాతి సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో యష్ నెక్స్ట్ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా కన్నడ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో సినిమా చేయడాకి యష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
మూతోన్, కేల్కున్నుడో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న గీతూ.. ఎప్పటినుంచో యష్ తో సినిమా తీయాలని ప్లాన్ చేసినట్లు తెలిపింది. ఆమె చెప్పిన యాక్షన్ థ్రిల్లర్ కథ నచ్చడంతో యష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే ప్రకటన వస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం.