Bigg boss 7: ‘బిగ్బాస్ రతికతో పెళ్లి’.. హీరో కిరణ్ ఏమన్నాడంటే..?
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి, కిరణ్ అబ్బవరం జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమాకు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా.. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతోంది. అక్టోబర్ 6న విడుదలయ్యే ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో హీరో కిరణ్ ట్విట్టర్ లో క్యూ అండ్ ఏ సెషల్ నిర్వహించాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాదానాలు ఇచ్చాడు. ‘సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటని?’ అడిగే.. ‘తన నటన చాలా నేచురల్ గా ఉంటుందని చెప్పినట్లు’ వివరించాడు.
ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే ఉంటుందని, సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ ఏం ఉండవని, ఫ్యాన్స్ అలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ఫ్యాన్.. ‘రూల్స్ రంజన్ హిట్ అయిన తర్వాత నీకు బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక లాంటి భార్య రావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. దానికి ఆన్సర్ ఇచ్చిన కిరణ్... ‘బాబు నామీద నీకెందుకంత పగ. పెళ్లి అయితే చేసుకుందాం కానీ.. ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం’ అని అన్నాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టి తన గ్లామర్ తో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న రతిక.. ఇటీవలే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
#AskKiranAbbavaram #RulesRanjann https://t.co/Pvxflik5oe pic.twitter.com/edZXIvyeoV
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023