టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో వెండి తెరపైకి రానుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఆయన సినిమాలు చేసిన సంస్థలన్నీ టాప్ లిస్టులో ఉన్నవే. గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్, మెగా సూర్య మూవీస్ లాంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేశాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల కిరణ్ అబ్బవరం దావత్ అనే టాక్ షోలో పాల్గొన్నాడు. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఫ్యూచర్ లో డైరెక్షన్ చేయాల్సి వస్తే.. ఏ హీరోతో సినిమా చేస్తారని అడగగా క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు కిరణ్. ‘నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ గా నా మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తో తియాలనుకుంటున్నా’అని తన మనసులో మాట చెప్పాడు. దీంతో టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా పలు సందర్భాల్లో తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని కిరణ్ అబ్బవరం చాలాసార్లు చెప్పాడు. దీంతో పవన్ అభిమానులు కిరణ్ పై ప్రశంసలు కురిపిస్తునానరు. త్వరగా సినిమా తెరకెక్కాలని ఆశిస్తున్నారు.