Bigg Boss season 7: ఓటింగ్పై క్లారిటీ.. ఫస్ట్ వీక్లో గ్లామర్ బ్యూటీ ఔట్!

Byline :  Bharath
Update: 2023-09-07 09:04 GMT

బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతుంది. గతంలో ఎన్నడూ చూడని కొత్త కాన్సెప్టుతో వచ్చి.. ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది బిగ్ బాస్. ఈ ఉల్టా పల్టా సీజన్ లో.. తొలివారమే కంటెస్టెంట్స్ అన్ని రకాల ఎమోషన్స్ను బయటపెడుతున్నారు. తొలివారమే గొడవలు మొదలయ్యాయి. రెండో రోజే నామినేషన్స్ మొదలుపెట్టేసరికి.. ఇంట్లో ఉన్న 14 మంది కౌంటర్స్ వేసుకున్నారు. వాళ్లకు ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పూ.. ఒక్కో వ్యక్తి తలో ఇద్దరిని నామినేట్ చేశారు. ప్రస్తుతం ఎనిమిది మంది సభ్యులపై నామినేషన్ కత్తి వేలాడుతోంది. శోభాశెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీలా, దామిని నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు.




 


కాగా తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అన్న ఆసక్తి ఆడియెన్స్ మొదలయింది. ఇక నామినేషన్స్ లో ఉన్నవాళ్లకోసం ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్ వేస్తున్నారు. అయితే గతంలో ఎంతమందికి అయినా ఓటేసి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడలా లేదు. ఓటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఊహించని రీతిలో పల్లవి ప్రశాంత్ భారీ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. దాదాపు సగం ఓట్లు ప్రశాంత్ కే వస్తుండటం విశేషం. అతని సింపథీ గేమ్ వర్కౌట్ అవడం, రైతు అనే ఆలోచనతో ఓట్లు వేస్తున్నారు. ప్రశాంత్ తరువాత స్థానంలో గౌతమ్ కృష్ణ కి ఓట్లు పడుతున్నాయి. శోభా శెట్టితో జరిగిన గొడవ గౌతమ్ కృష్ణ‌ కి ప్లస్ అయింది. అంతేకాకుండా తనని ఎంతమంది నామినేట్ చేసినా.. నవ్వుతూ, పద్దతిగా మాట్లాడటం కలిసొచ్చింది.

కార్తీకదీపం క్రేజ్ ఉండటంతో శోభాశెట్టికి బాగానే ఓట్లు పడుతున్నాయి. తెలంగాణ అమ్మాయి రతిక రోజ్ కూడా ముందంజలో ఉంది. మిగిలిన వాళ్లంతా ఓటింగ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయినట్టు తెలుస్తుంది. ఓటింగ్ పరంగా చూస్తే ప్రస్తుతానికి ప్రిన్స్ యావర్‌, కిరణ్ రాథోడ్ డేంజర్ జోన్ లో ఉన్నారు.అయితే రేపటి వరకూ ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లోనే ఉండటంతో.. ఈ రెండు రోజుల ప్రదర్శనను బట్టి ఓటింగ్ లో మార్పులు రావచ్చు. అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కిరణ్ రాథోడ్‌కే ఎక్కువగా ఉంది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోవడం, భాష సమస్యతో అందరితో కలవలేకపోతుంది. అలా అని ఈ వీకెండ్‌లో కిరణ్ ఎలిమినేట్ అవుతుందని ఏం చెప్పలేం. ఉల్టా పల్టాగా ఏమైనా జరగొచ్చు.


Tags:    

Similar News