Marimuthu : డ‌బ్బింగ్ స్టూడియోలో గుండెపోటు.. 'జైలర్' నటుడు మృతి

Byline :  Veerendra Prasad
Update: 2023-09-08 05:52 GMT

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ జి. మారిముత్తు (Actor Marimuthu) (57) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మారిముత్తు ఇప్పటివరకు వందకుపైగా సినిమాల్లో నటించారు. తాజాగా విక్రమ్, జైలర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా జైలర్ సినిమాలో విలన్ కి నమ్మకస్తుడి పాత్రలో మారుమూత్తు నటించిన సంగతి తెలిసిందే. మారిముత్తు మృతి నేపథ్యంలో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.




 


ఎథిర్ నీచెల్ అనే టీవీ షోకు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి శుక్ర‌వారం ఉద‌య‌మే మారిముత్తు డ‌బ్బింగ్ స్టూడియోకు వెళ్లిన‌ట్లు స‌న్నిహితులు చెబుతున్నారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. త‌మిళంలో మారిముత్తు వంద‌కుపైగా సినిమాల్లో క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు.




 


అజిత్ హీరోగా ఎస్‌జే సూర్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన వాలి సినిమాతో న‌టుడిగా మారారు మారిముత్తు. ఇటీవ‌ల విడుద‌లైన ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌లో కీల‌క పాత్ర పోషించారు మారిముత్తు. మారిముత్తు న‌టించిన ప‌లు సినిమాలు తెలుగులో అనువాద‌మై విజ‌యాల్ని అందుకున్నాయి. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా రెండు త‌మిళ సినిమాల్ని తెర‌కెక్కించారు మారిముత్తు. మారిముత్తు మ‌ర‌ణంతో త‌మిళ చిత్ర‌సీమ‌లో విషాదం అలుముకుంది.




Tags:    

Similar News