Adipurush: డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్.. కనిపిస్తే చంపేస్తం: క్షత్రియ కర్నీ సేన

Update: 2023-06-19 12:42 GMT

భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే, విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాపై విమర్శలు కురుస్తున్నారు. రామాయణాన్ని కించ పరిచారని, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్, రావణ పాత్రలను మలచిన తీరు బాగోలేదని ప్రేక్షకులు మండి పడుతున్నారు. సినిమాలోని డైలాగ్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి. ఇందులోని డైలాగ్స్ ఏవీ వినసొంపుగా లేవని.. క్యారెక్టర్లకు తగ్గ డైలాగ్స్ రాయలేదని అంటున్నారు. కొంతమంది ఈ సినిమాను నిషేదించాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో క్షత్రియ కర్ని సేన డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాశిర్ లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి.




 


క్షత్రియ కర్నీ సేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షెకావత్.. డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ను హెచ్చరించారు. మధ్యప్రదేశ్ లోని బియోరాలో మీడియాతో మాట్లాడిన ఆయన ‘అఖండ భారతం ఆరాధించే రామాయణాన్ని ఓం రౌత్ కించ పరిచాడు. దైవ రూపాలను దారుణంగా చిత్రీకరించాడు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తాడు. ఓం రౌత్, మనోజ్ ల కోసం మా వాళ్లు వెతుకుతున్నారు. వాళ్లు కనిపించిన మరు క్షణం వాళ్లను చంపేస్తార’ని అన్నాడు.

మనోజ్ నిన్న (జూన్ 18) ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానుల్ని ఆగ్రహానికి గురిచేసింది. ‘ఆదిపురుష్.. రామాయణం కాదు. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని, మేం కల్పించుకుని రాసుకున్న కథ. మా కథకు అనుగునంగా పాత్రలను తెరకెక్కించాం’ అని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో రైటర్ మనోజ్ కు ముంబై పోలీసులు రెట్టింపు బద్రతనిచ్చారు.





 









Tags:    

Similar News