ఆమెతోనే పెళ్లి..హింట్ ఇచ్చిన రౌడీ బాయ్?

Byline :  Aruna
Update: 2023-08-29 15:10 GMT

లైగర్ ఫ్లాప్ తరువాత విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. అందుకే మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీతో వెండితెర మీద సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. శివ నిర్వాణ డైరెక్షన్‎లో ఖుషి సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించబోతున్నాడు ఈ రౌడీ బాయ్. సమంత హీరోయిన్‌గా నటించిన మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ ఖుషీ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‎లో చేస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ అంతా విజయ్ ఇన్‎స్టాగ్రామ్ స్టోరీ గురించి తెగ చర్చించుకుంటున్నారు.




 


ఖుషీ మూవీ టీమ్‎తో పాటు సమంత, విజయ్ దేవరకొండ ఓ రేంజ్‎లో తమ సినిమాను ప్రమోషన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తమదైన స్టైల్‎లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ఇద్దరు స్టార్స్ తమ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. ఇదే క్రమంలో విజయ్ త్వరలో ఓ విషయాన్ని చెబుతానని తన న్‎స్టాగ్రామ్ స్టోరీలో తన ఫ్యాన్స్‏ కోసం ఓ మెసేజ్‎తో కూడిన ఫోటోను షేర్ చేశాడు. దీంతో ఈ స్టోరీపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ఫోటోలో విజయ్ ఒక చేయి పట్టుకుని కనిపించాడు. దీనికి కొనసాగింపుగా "చాలా జరుగుతున్నాయి..కానీ, ఇది మాత్రం నిజంగా ఎంతో స్పెషల్, త్వరలోనే అనౌన్స్ చేస్తాను" అని రాశాడు. దీంతో ఈ స్టోరీకి విజయ్ పర్సనల్ లైఫ్ కి ఏమైనా రిలేషన్ ఉందా అన్న కోణంలో నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడా? లేకపోతే ప్రమోషన్ స్టంటా అంటూ మరికొంత మంది కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు నెటిజన్లు ఇది విజయ్ లవ్ మ్యాటర్‎కు సంబంధించిన విషయమని, తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేస్తాడని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. అసలు విషయం ఏమిటి అనేది మాత్రం విజయ్ ప్రకటిస్తేనే ఓ క్లారిటీ రానుంది.




Tags:    

Similar News