సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు సమంత. వరుసగా తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి షూటింగ్‌లు శరవేగంగా సాగుతున్నాయి. షెడ్యూల్ నిమిత్తం విరామం లేకుండా ఈ భామ ముంబై, కాశ్మీర్ అంటూ బిజీ బిజీగా తిరిగేస్తోంది. ప్రస్తుతం రౌడీబాయ్ విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. దీంతో తాజాగా సామ్ టర్కీలో మకాం వేసింది. సమంతతో పాటు విజయ్ టర్కీలో వాలిపోయాడు. దీంతో కో స్టార్స్ ఇద్దరూ టర్కీ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ అందాలను ఫీల్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ స్టార్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఖుషీ తాజా షెడ్యూల్ నిమిత్తం సమంత , విజయ్ ప్రస్తుతం టర్కీలో ఉన్నారు. ఈ దేశంలోని వివిధ ప్రదేశాలలో ఒక పాటను మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం స్టార్స్ దాదాపు ఒక నెల పాటు టర్కీలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో బిజీ షెడ్యూల్లో కాస్త గ్యాప్ దొరకగానే సమంతా , విజయ్ దేవరకొండ టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో చిల్ అవుతున్నారు. కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ సరదాగా ఎవరికివారే గడుపుతున్నారు. విజయ్ టర్కీలోని ఫుడ్ స్పాట్స్‌లో ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తుంటే..సమంత ప్రకృతి ఒడిలో నిదురిస్తూ కలలు కంటోంది.
ఖుషీ సినిమా ద్వారా ఓ కొత్త తరహా ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. నిజానికి ఖుషీ జులైలో విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా షూటింగ్ పోస్ట్‌పోన్ కావడంతో ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. అయితే మొదట తెలుగు, తమిళ భాషల్లోనే ఖుషీని విడుదల చేద్దామని మేకర్స్ భావించినప్పటికీ ఇప్పుడు ఆ ప్లాన్ ఛేంజ్ చేసి పాన్ ఇండియా లెవెల్లో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. లైగర్ డిజాస్టర్‌తో విజయ్, శాకుంతలం ఫ్లాప్‌తో సమంత కాస్త అప్సెట్ అయిన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఖుషీతో మాత్రం మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.