Vijay Deverakonda : యాదాద్రిలో రౌడీని వాటేసుకోబోయిన పిల్ల.. ఇదీ సీన్..

Byline :  Lenin
Update: 2023-09-03 14:31 GMT

యాదాద్రిలో రౌడీని వాటేసుకోబోయిన పిల్ల.. ఇదీ సీన్..

అభిమాన తారలతో ఓ ఆటోగ్రాఫ్ తీసుకుని దాచుకోవడం ఒకప్పటి మాట. ఇప్పుడు స్టార్ల దగ్గరికి వెళ్లే అకాశం లేదు. వారికి కూడా సంతకాలు చేసేంత సమయం లేదు. వెండితెరపై తప్ప నిజజీవితంలో తారలు తారసపడడం చాలా అరుదు. ఏదో అనుకోని సందర్భంలో హీరోలు, హీరోయిన్లు కనిపిస్తే అభిమానులకు పండగే పండగ. పైగా ఇది సెల్ఫీల కాలం. ఓ షేక్ హ్యాండ్, ఓ నవ్వుతో సరిపెట్టుకోవడం లేదు ఫ్యాన్స్. ఓ మాంచి సెల్ఫీ కావాల్సిందే. ఇంకా వీలైతే ఓ హగ్.. ఇంకా ఇంకా వీలైతే ఓ కిస్! అభిమానుల అత్యుత్సాహం వల్ల స్టార్లు చాలా ఇబ్బందిపడుతుంటారు. రౌడీ విజయ్ దేవరకొండకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.

సమంతతో కలసి నటించిన ‘ఖుషి’ హిట్ కావడంతో విజయ్ ఆదివారం కుటుంబ సభ్యులతో, మూవీ టీమ్‌తో కలసి యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడు. లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని బయటికి వస్తుండగా ఓ లేడీ ఫ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి అతణ్ని కౌగిలించుకోవడానికి ప్రయత్నించింది. ఏం జరుగుతుందని విజయ్ తేరుకునేలోపు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ అమ్మాయి పక్కకు లాగారు. విజయ్ వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆమె అతని పక్కనే నిల్చుని చిర్నవ్వులు చిందిస్తూ ఫోటో తీయించుకుంది. అభిమాన హీరోను కలిశానన్న సంబరంతో ఆమె పక్కకు వెళ్లింది. విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం తమకు బాగా కలిసొచ్చిందని అన్నారు. తన తమ్ముడు ఆనంద్ సినిమా బేబీ, తన ఖుషి హిట్ కావడంతో యాదాద్రీశుడికి మొక్కుకోవడానికి గుడికి వచ్చామన్నారు.  

Tags:    

Similar News