శుక్రవారం (జూన్ 10) వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. దాదాపు ఆరేళ్లుగా సీక్రెట్ ప్రేమలో ఉన్న ఈ లవ్ బడ్స్.. రింగులు మార్చుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ‘ఈ ఇద్దరు పెద్దగా కలిసి నటించలేదు. ఎప్పుడూ బయట తిరిగినట్లు కనిపించలేదు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది’ అనే క్వశ్చన్ మార్క్ ఫ్యాన్స్ లో మొదలయింది. అయితే, ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలను లావణ్య.. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఫొటోల కింద క్యాప్షన్ గా.. ‘నాకు 2016లో శాశ్వత ప్రేమ దొరికింది’ అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్ లో కొంత క్లారిటీ వచ్చింది.
2016లో మిస్టర్ సినిమా షూటింగ్ టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి సీక్రెట్ గా రిలేషన్ షిప్ ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏడాది అంతరిక్షం సినిమాలోనూ వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీరి లవ్ జర్నీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. నిహారిక ఎంగేజ్మెంట్, పెళ్లిలోనూ లావణ్య వరుణ్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్స్ నెట్టింట్లో రావడంతో.. వీరిద్దరి లవ్ గురించి పుకార్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు ఎంగేజ్మెంట్తో తమ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చేశారు.