క్షమాపణలు చెబుతున్నా.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటా: లారెన్స్

Update: 2023-08-27 14:52 GMT

రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా చంద్రముఖి 2005లో రిలీజ్ అయింది. దీనికి సీక్వెల్ గా రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జోడిగా తెరకెక్కకుతోంది చంద్రముఖి-2. ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15 విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర బృదం ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో లాంచ్ జరిగింది. ఆ ఈవెంట్ లో ఓ కాలేజ్ స్టూడెంట్ పై లారెన్స్ బౌన్సర్ చేయిచేసుకున్నాడు. దీంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై లారెన్స్ స్పందించాడు. బౌన్సర్లపై మండిపడ్డాడు. దాడికి గురైన వ్యక్తికి క్షమాపణలు కూడా చెప్పాడు.

‘స్టూడెంట్ పై దాడి జరిగిన విషయం నాకు గానీ, ఫంక్షన్ నిర్వహించిన సంస్థకు గానీ తెలియదు. వ్యక్తిగతంగా నాకు గొడవలు నచ్చవు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈ విషయం నా దృష్టికి వచ్చింది. స్టూడెంట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. వాళ్లు జీవితంలో పైకి రావాలని కోరుకుంటా. అలాంటిది వాళ్లపై దాడి, కొట్లాటలు నేను సహించ. కారణం ఏదైనా సరే ఓ వ్యక్తిని, ముఖ్యంగా స్టూడెంట్ ను కొట్టడం తప్పు. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. క్షమాపనలు చెప్తున్నా. ఇకపై ఇలాంటి దాడులు జరగవని మాటిస్తున్నా. నా బౌన్సర్లకు ఇదే నా విజ్ఞప్తి’ అంటూ ట్వీట్ చేశాడు.




Tags:    

Similar News