Nikhil : డైపర్ డ్యూటీ నేర్చుకుంటున్నా..నిఖిల్ వీడియో వైరల్

Update: 2024-02-11 02:43 GMT

హ్యాపీడేస్ మూవీలో తెలంగాణ కుర్రాడిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు హీరో నిఖిల్(Nikhil). సైడ్ క్యారెక్టర్ తో మొదలై హీరోగా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో నిఖిల్ ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. అంతేగాక ‘కార్తికేయ 2’(Karthikeya 2) సినిమా హిట్ తో పాన్ ఇండియా రెంజ్ ను అందుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా నిఖిల్ తన భార్య సీమంతం ఫొటోలను షేర్ చేసి.. తాము పేరేంట్స్ కాబోతున్నామని సోషల్ మీడియాలో తెలిపారు. అయితే తాజాగా నిఖిల్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో కత్తులు, యుద్ధాలు, గుర్రపు స్వారీ.. ఇలాంటి వన్నీ ఉంటాయనేలా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఇక ఈ మూవీతో పాటు ఆయన మరో రెండు మూడు సినిమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పుడు తండ్రిగా తన బాధ్యతలను తెలుసుకుంటున్నానని తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు. అందులో ‘డైపర్ డ్యూటీని నేర్చుకుంటున్నాను.. త్వరలో బేబీ వచ్చేస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో చిన్న పిల్లలకు డైపర్ ఎలా వేయాలో నిఖిల్ ఓ బొమ్మతో ప్రాక్టీస్ చేస్తుంటే.. తన భార్య, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దాన్ని చూస్తున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా కరోనా టైమ్‌లో 2020లో కరోనా ఆంక్షల మధ్య పల్లవిని నిఖిల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వృత్తి రీత్యా డాక్టర్ అయిన పల్లవిని నిఖిల్ లవ్ మ్యారెజ్ చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేండ్ల తర్వాత.. వారు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

Tags:    

Similar News