LEO : తెలుగులో లియోకి కష్టాలేనా

Update: 2023-10-11 06:47 GMT

దసరా సీజన్ లో ఈ సారి అన్నీ పెద్ద సినిమాలే వస్తున్నాయి. అన్ని సినిమాలపైనా బజ్ ఉంది. ఆ బజ్ ను నిలబెట్టుకుంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. అయితే పోటీని తట్టుకుని నిలవడం అంత సులభమేం కాదు. ముఖ్యంగా తెలుగు సినిమాలతో డబ్బింగ్ సినిమాలు పోటీ పడటం కాస్త పెద్ద టాస్క్ అవుతుంది. ఆ టాస్క్ లోకి ఎంటర్ అవుతూ నందమూరి బాలకృష్ణను ఢీ కొట్టబోతున్నాడు తమిళ్ హీరో విజయ్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందిన లియోతో ఈ నెల 19న బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. అదే రోజు తెలుగు నుంచి బాలయ్య భగవంత్ కేసరి విడుదలవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఫస్ట్ టైమ్ తన ఏజ్ కు తగ్గ గెటప్ లో బాలకృష్ణ నటించిన సినిమా భగవంత్ కేసరి. శ్రీ లీల ఆయన కూతురు పాత్రలో కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనేలా ఉంది. అంతే కాక ట్రైలర్ లో లేని చాలా అంశాలు సినిమాలో ఉండబోతున్నాయనేదీ అర్థం అవుతుంది. బాలయ్య, అనిల్ ఇద్దరూ తమ ఇమేజ్ పరిధిలను దాటి కొత్తగా చేసిన ప్రయత్నంలా ఉన్న ఈ మూవీని ఫస్ట్ డే ఢీ కొట్టడం లియోకి కష్టం అనే చెప్పాలి.

లియోను తెలుగులో సితార బ్యానర్ వాళ్లు విడుదల చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయడం వల్ల తెలుగులో లియో కోసం ఆసక్తిగా చూసేవాళ్లు ఉన్నారు. విజయ్ కూడా కొంతకాలంగా తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. కొంత వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. విజయ్, లోకేష్ లది క్రేజీ కాంబినేషన్. అందుకే బాలయ్యకు పోటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. బట్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో భగవంత్ కేసరిని ఢీ కొట్టడం సాధ్యం కాదు. భగవంత్ కేసరికి హిట్ టాక్ వచ్చినా చాలు.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అవుతుంది. లియో హిట్ టాక్ తెచ్చుకున్నా.. నెక్ట్స్ డే మళ్లీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఉంది.

టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ బావుంది. అందుకే భారీ అంచనాలున్నాయి. ఇదీ ప్యాన్ ఇండియన్ రేంజ్ లోనే విడుదలవుతున్న సినిమా. అందువల్ల లియోకు ఇతర ప్రాంతాల్లో కూడా పోటీగా ఉంటుంది. మొత్తంగా ఈ రెండు సినిమాల్లో లేని ఇంకేదైనా అద్భుతమైన కంటెంట్ ఉంటే తప్ప లియో నిలబడదు. లేదంటే బాలయ్య, రవితేజ సినిమాల మధ్య నలిగిపోక తప్పదు.


Tags:    

Similar News