తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా లియో. త్రిష హీరోయిన్. సంజయ్ దత్, అర్జున్ సర్జా విలన్లుగా నటించారు. దసరా సందర్భంగా ఈ నెల 19న లియో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూసిన చాలామంది ఈ చిత్రం 2005లో హాలీవుడ్ లో వచ్చిన ‘ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ అనే సినిమా నుంచి సీన్స్ కాపీ కొట్టారంటూ సెటైర్స్ వేశారు. ముఖ్యంగా విజయ్ తుపాకీని చేతిపై తిప్పుతూ కాల్చే సన్నివేశం అచ్చంగా ఆ సినిమాలో ఉన్నదే అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. అసలే తమిళనాడులో ఫ్యాన్ వార్ దారుణంగా ఉంటుంది. లియో కాపీ సినిమా అంటూ కంటిన్యూస్ గా ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించలేదు కానీ.. ఆ సినిమాలో నటించిన ఆత్మా పాట్రిక్ అనే నటుడు ఓ కొత్త విషయం చెప్పాడు.
అందరూ అనుకుంటున్నట్టు లియో ఒరిజినల్ సినిమా కాదట. లోకేష్ కనకరాజ్ ‘ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ సినిమా రీమేక్ రైట్స్ ను అఫీషియల్ గానే తీసుకున్నాడట. అయితే లియోలోని ప్రతి సన్నివేశం ఒరిజినల్ కంటే వంద రెట్లు బెటర్ గా ఉంటుందని చెప్పాడీ నటుడు. దీంతో లియో .. లోకేష్ కనకరాజ్ సొంత కథ కాదు అన్న విషయం బయటకు వచ్చింది. మరి ఇది నిజమేనా లేక లోకేష్ వద్ద ఇంకేదైనా వెర్షన్ ఉందా అనేది తెలియాల్సి ఉంది.
లియో ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే అంచనాలను అందుకోలేదు అని స్వయంగా విజయ్ ఫ్యాన్సే ఒప్పుకుంటున్నారు. ఆ ట్రైలర్ బాలేదనే తమిళనాడులో ఒక థియేటర్ నే ధ్వంసం చేశారు. అయితే లోకేష్ కావాలనే లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నాడనే వారూ ఉన్నారు. ఏదేమైనా ఈ మూవీ రీమేక్ అన్న విషయం తెలిసిన తర్వాతైనా ట్రోల్స్ ఆగుతాయా లేదా అనేది చూడాలి.