MAD Movie : ఈ ఫ్రైడే కి ఎన్ని కష్టాలు వచ్చాయో

Byline :  Mic Tv Desk
Update: 2023-10-07 13:22 GMT

ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ కొన్ని శుక్రవారాలు మాత్రం ఇంక ఫ్రైడేస్ రావు అన్నంత హరీబరీగా వస్తుంటాయి. అలాంటప్పుడు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కన్ఫ్యూజన్ లో కొన్ని మంచి సినిమాలు కూడా కొట్టుుపోతుంటాయి. అలాంటిదే ఈ శుక్రవారం. నెక్ట్స్ ఫ్రైడే అస్సలు పోటీయే లేదు. అయినా ఈ వారం ఏకంగా ఏడెనిమిది సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కాస్త ప్రామిసింగ్ అనిపించుకున్న చిత్రాలూ ఉన్నా.. ఎక్కువ ప్రామిసింగ్ అనిపించుకుంది మ్యాడ్ మూవీ. ఈ మూవీకి ముందు నుంచీ మంచి బజ్ ఉంది. ఆ బజ్ కు తగ్గట్టుగా ఓపెనింగ్స్ వచ్చాయి. కంటెంట్ కామెడీగా ఉండటంతో కమర్సియల్ గా కూడా ఫస్ట్ డే మంచి వసూళ్లే సాధించింది. ఇక నిలబడుతుందని కూడా విశ్లేషకులు అంటున్నారు.

మ్యాడ్ తర్వాత ఆడియన్స్ అటెన్షన్ ను ఎక్కువగా తెచ్చుకున్న సినిమాలు రూల్స్ రంజన్, మామా మశ్చీంద్రా. ఈ రెండు సినిమాలూ వీక్ కంటెంట్ తో డిజాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా రూల్స్ రంజన్ ను చూసినవాళ్లు, విమర్శకులు ఏకి పడేస్తున్నారు. ఇటు మామా మశ్చీంద్రా కోసం సుధీర్ బాబు ఎఫర్ట్ ను మెచ్చుకుంటున్నారు కానీ.. కంటెంట్ పరంగా బిలో యావరేజ్ గా తేల్చారు.

ఇక తాము ఒక కళాఖండం తీశాం అనే కలరింగ్ తో కనిపించారు మంత్ ఆఫ్ మధు మేకర్స్. ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సెన్సిబుల్ మూవీగా ఆకట్టుకుంటుందని చాలామంది భావించారు. నిజంగా కొన్ని సెన్సిబులిటీస్ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా రాసుకున్న కథను సినిమాటిక్ గా తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీకి ఫస్ట్ డే గొప్ప రెస్పాన్స్ రాలేదు. అందుకు కారణం కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన రివ్యూసే అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మౌట్ టాక్ ఫర్వాలేదు అనిపించుకుంది. అది పెరిగితే కలెక్షన్స్ పెరుగుతాయి. లేదంటే ఇదీ డిజాస్టర్ గానే మిగులుతుంది.

ఇక ఉన్నంతలో సిద్ధార్థ్ నటించిన తమిళ్ మూవీ చిత్తా ను తెలుగులో చిన్నాగా డబ్ చేశాడు. ప్రీవ్యూస్ చూసిన ప్రతి ఒక్కరూ గుక్కపట్టి ఏడ్చినంత పని చేశారు. అంత ఎమోషనల్ గా ఉందీ సినిమా. కాంటెంపరరీ ఇష్యూను జెన్యూన్ గా డిస్కస్ చేశాడు దర్శకుడు. ఇంత హానెస్ట్ గా తీసిన సినిమా ఈ మధ్య కాలంలోనే రాలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ సరైన ప్రమోషన్ లేకపోవడం ఇది అందరు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కథ కాకపోవడంతో అసలు విడుదలైన విషయం కూడా సరిగ్గా చేరలేదు.

ఈ మూవీస్ లో మ్యాడ్ మాత్రమే రేస్ లో విన్నర్ గా నిలిచింది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు యూత్ ప్రధాన బలంగా మారారు అని కలెక్షన్స్ చూస్తే తెలుస్తోంది. సో.. ఓవరాల్ గా చూస్తే.. మ్యాడ్ సాలిడ్ విన్నర్ గా గెలిచినట్టే. 

 

Tags:    

Similar News