ధనుష్‌కు పెద్ద తలనొప్పిగా మారిన కేసు..షాకిచ్చిన కోర్టు

Byline :  Shabarish
Update: 2024-03-14 07:39 GMT

తమిళ హీరో ధనుష్ ఈ మధ్యనే తెలుగులో 'సార్' మూవీతో హిట్ కొట్టాడు. తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ మూవీ చేస్తున్నాడు. అటు తమిళంలో కూడా ఆయన సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. స్టార్ హీరోగా ఆయన పాటికి ఆయన సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. గత 8 ఏళ్లుగా ధనుష్ తమ కొడుకే అంటూ ఓ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు అలా సాగుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్టికి ఆ కేసుకు సంబంధించి కోర్టు తీర్పునిచ్చింది. ఇంతకీ ధనుష్ తల్లిదండ్రులు వారేనా? కోర్టు ఏ తీర్పు ఇచ్చింది?

ధనుష్ తమ సొంత కొడుకే అంటూ మధురైలోని మేలూర్‌కు చెందిన కతిరేసన్ దంపతులు కోర్టుకెక్కారు. సినిమాల పిచ్చితో ధనుష్ ఇంటర్ చదువు వదిలేసి ఇంటి నుంచి పారిపోయాడని ఆ దంపతులు చెబుతున్నారు. ధనుష్ వారు 2015లోనే మేలూర్ కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ కేసు అలా సాగుతోంది. కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. ధనుష్ బర్త్ సర్టిపికేట్, టెన్త్ క్లాస్ టీసీ, ఉద్యోగం కోసం ధనుష్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కోర్టుకు ఇచ్చారు.

ఇంతవరకూ బానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు విషయాన్ని ఆ దంపతులు కోర్టుకు చెప్పారు. ధనుష్ తమ కొడుకే కాబట్టి ప్రతి నెలా తమ నెలవారీ ఖర్చులకు 65,000 ఇప్పించాలని వారు కోర్టును కోరారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరుగుతూ వస్తోంది. తాజాగా కోర్టు కదిరేశన్ దంపతులకు షాకిచ్చింది. కదిరేశన్ ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని కోర్టు తేల్చింది. సరైన ఆధారాలు చూపనందుకు కేసును కొట్టివేసింది. కదిరేశన్ ఉద్దేశపూర్వకంగానే కోర్టులో కేసు వేసినట్లు చెప్పింది. దీంతో ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ కేసు నుంచి ధనుష్‌కు బిగ్ రిలీఫ్ లభించింది.

ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగర్జునతో కలిసి 'కుబేర' మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ నేడు బ్యాంకాక్‌లో స్టార్ట్ అయ్యింది. మాఫియా స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో బడా డాన్‌గా ధనుష్ కనిపిస్తారట. అలాగే నాగ్ కూడా క్రేజీ క్యారెక్టర్‌ చేస్తున్నారట. శివరాత్రి రోజు ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ధనుష్.. గుబురు గెడ్డం, మాసిన బట్టలతో గుడి ముందు బిచ్చగాడిలో కనిపిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News