'మగధీర'తో పోటీపడుతున్న 'నువ్వునేను'

Byline :  Shabarish
Update: 2024-03-19 11:19 GMT

తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల సందడి మామూలుగా లేదు. బడా సినిమాలు లైన్లో ఉన్నా బాక్సాఫీస్ దగ్గర ఒకప్పటి సినిమాలు దూసుకొస్తున్నాయి. అసలే ఎగ్జామ్ సీజన్.. ఈ టైంలో సినిమాలను రిలీజ్ చేయాలని ఎవ్వరూ అనుకోరు కదా. కానీ ఈ గ్యాప్‌నే క్యాష్ చేసుకునేందుకు రీరిలీజ్ సినిమాలు పోటీపడనున్నాయి. ఒకప్పటి హిట్ సినిమాలు మగధీర, నువ్వునేను.. నువ్వా నేనా అంటూ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 26న మగధీర మూవీ రీ రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లోనే వంద కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఇదే టైంలో దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వునేను సినిమా కూడా రీరిలీజ్ కానుంది. మెగా ఫ్యామిలీలోకి అల్లుడుగా వెళ్లలేకపోయిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గి కనుమరుగయ్యాడు. అప్పట్లోనే ఉదయ్ కిరణ్ సినిమాలు సెన్సేషనల్ హిట్ సాధించాయి.

ఉదయ్ కిరణ్ సినిమా ఏది విడుదలైనా ఆడియన్స్ వదిలిపెట్టేవారు కాదు. అందులో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వునేను మూవీ మరింత స్పెషల్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమాతో మగధీర పోటీ పడనుంది. మార్చి 21న నువ్వునేను రీ రిలీజ్ కానుండగా నాలుగు రోజుల గ్యాప్‌లో 26న మగధీర రీ రిలీజ్ కానుంది. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువ కలెక్షన్స్ సాధించనుంది? రేసులో ఎవరు గెలుస్తారు? తెలియాలంటే వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.

Full View

Tags:    

Similar News