సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. లంగా ఓణీ కట్టుకుని సారంగదరియా పాటకు డ్యాన్స్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. చక్కని అభినయంతో, క్యూట్ క్యూట్ స్టెప్పులు వేసి సితార అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. సితార పాప డ్యాన్స్ చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిని ఆకట్టుకునేందుకు సితార తరచుగా డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది లవ్ స్టోరీ సినిమాలోని ‘సారంగదరియా’ పాటకు స్టెప్పులు వేసి ఆ వీడియోను తన ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోతో సితార అందరిని ఆకట్టుకుంది. లంగా ఓణీలో చూపు తిప్పుకోనీయకుండా చేసింది. తన అదిరిపోయే స్టెప్పులతో సాయి పల్లవిని గుర్తు చేసింది.