వాహ్ సితార అంటున్న నెటిజన్లు

Update: 2023-07-20 10:49 GMT

మహేష్ బాబు గారాలపట్టి సితార పుట్టినరోజు ఈరోజు. యాడ్స్ తో, డాన్స్ లతో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న ఆమె తన పుట్టినరోజు నాడు చేసిన ఓ పనితో అందరి మనసు దోచేసింది. తన 11వ బర్త్ డే నాడు కొంతమంది పేద విద్యార్ధులను తన ఇంటికి ఆహ్వానించి వారితో సరదాగా మాట్లాడింది. అంతేకాదు వాళ్ళకు సైకిళ్ళను గిఫ్ట్ గా ఇచ్చింది.

సోషల్ మీడియాలో మహేష్ కూతురు సితార పెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈరోజు తన బర్త్ డే సందర్భంగా కొంతమంది ఆడపిల్లలతో సరదాగా గడిపింది. కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంది. దీనికి సబంధించిన వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. అంతేకాదు అందరూ ఆమె మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కూడా. తండ్రికి తగ్గ తనయ అంటూ పొగుడుతున్నారు.

సితారా ఈమధ్యనే ఓ నగల యాడ్ లో యాక్ట్ చేసింది. అందుకు ఆమె కొంత పారితోషకం అందుకుంది. ఆ వచ్చిన దాన్నే ఇప్పుడు ఛారిటీ కోసం వాడానని చెబుతోంది సితార. తాను పెద్దయ్యాక కచ్చితంగా సినిమాల్లోకే వస్తానని...ప్రస్తుతం డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటున్నాని చెప్పింది సితార.




Tags:    

Similar News