Mahesh babu : అప్పుడు ఎన్టీఆర్ .. ఇప్పుడు మహేష్ బాబు..

Byline :  Babu Rao
Update: 2024-01-10 10:31 GMT

అప్పుడు ఎన్టీఆర్ .. ఇప్పుడు మహేష్ బాబు.. ఇద్దరి విషయంలోనూ కామన్ గా కనిపిస్తున్నది త్రివిక్రమ్. ఆ ఇద్దరికి సంబంధించి మరో కామన్ థింగ్ ఏంటంటే రెండు సందర్భాల్లోనూ ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ తండ్రితో ముడిపడి ఉంది. యస్.. ఈ సెంటిమెంట్ స్టోరీ తెలియాలంటే ముందు మనం అరవింద సమేత వీరరాఘవ వరకూ వెళ్లాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ నటించిన ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే ఎన్టీఆర్ తండ్రి.. హరికృష్ణ అనుకోని ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణాన్ని దిగమింగుకుని సినిమా పూర్తి చేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్ లో చాలా ఎమోషనల్ అయ్యాడు. ఓ సారి వేదికపైనే బరస్ట్ అయ్యాడు కూడా. అప్పుడు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తనకు ఎంతో మోరల్ సపోర్ట్ గా నిలిచాడు అని చెప్పాడు. సినిమా సూపర్ హిట్ అయింది. అంతకంటే విశేషం ఏంటంటే.. ఆ కథంతా తండ్రి మరణం చుట్టూనే తిరుగుతుంది. ఇక ఇప్పుడు మహేష్ బాబు విషయంలోనూ అదే కనిపిస్తోంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా గుంటూరు కారం.ఈ ప్రాజెక్ట్ 2022లోనే ప్రారంభం అయింది. గుంటూరు కారం ముందు అనుకున్న కథ వేరే. ఆ కథను ఆపేసి మరో కథ రాసుకునే టైమ్ లోకనే ఒక్క 20 రోజుల వ్యవధిలోనే మహేష్ మదర్ ఇందిరా దేవి, తండ్రి కృష్ణగారు కన్నుమూశారు. ఓ రకంగా ఇది అంతులేని విషాదం. ఆ విషాదం నుంచి బయటపడేందుకు ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో రకరకాల కమెంట్స్ చేశారు చాలామంది. అయినా అవేవీ పట్టించుకోకుండా త్రివిక్రమ్ వెయిట్ చేశాడు. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ మరికొన్ని గంటల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు కూడా అప్పుడు ఎన్టీఆర్ లా చాలా ఎమోషనల్ అయ్యాడు. నిజానికి మహేష్ బాబు చాలా స్థితప్రజ్ఞతతో ఉంటాడు. అలాంటి తను కూడా తన తండ్రి లేకుండా వస్తోన్న ఫస్ట్ సినిమా ఇది అంటూ దుఖ్కపడ్డాడు. అది చూసి అభిమానులూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ కారణంగా అని చెప్పడం లేదు కానీ.. ఇదే వేదికపై నుంచి మహేష్ ఈ సారి గట్టిగా కొడుతున్నాం అంటూ స్ట్రాంగ్ గా చెప్పాడు. సో.. గుంటూరు కారం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.


Tags:    

Similar News