గడ్డకట్టే చలిలో ఫ్యామిలీతో సూపర్ స్టార్..ఇక జక్కన్న మూవీ ఎప్పుడు?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్ల ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళితో ఈపాటికే సినిమా మొదలెడతానని చెప్పి ఇప్పుడు చెప్పాపెట్టకుండా వెకేషన్‌కు వెళ్లిపోయాడు. జక్కన్న, మహేష్ కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈమధ్య శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన మహేష్ ఫ్యామిలీ ఇప్పుడు గడ్డ కట్టే చలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు కొండల మధ్య, గడ్డ కట్టే చలిలో కూతురు సితార, కొడుకు గౌతమ్‌తో కలిసి మహేష్ కనిపిస్తున్నాడు.
ఇప్పుడు మహేష్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లొకేషన్ నుంచి తన కూతురు, కొడుకుతో కలిసి మహేష్ సెల్ఫీలకు ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలను మహేష్ తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. మహేష్ అక్కడ అలా ఉంటే జక్కన్న టీమ్ ఇక్కడ వర్క్‌ను స్టార్ట్ చేసేశామని చెప్పుకుంటోంది. రేపో మాపో షూటింగ్‌కు వెళ్తున్నాం అంటూ గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తోంది. సాధారణంగా మహేష్ వేడి ప్రదేశాల్లో ఎక్కువగా ఉండడని తెలుసు. అందుకే సమ్మర్లో ఎక్కువగా కూల్ ప్లేసులకు ఫ్యామిలీతో కచ్చితంగా వెళ్లిపోతాడు.
దీన్నిబట్టి చూస్తే మహేష్ ఈ సమ్మర్ తర్వాతే రాజమౌళి సినిమా షూట్‌కు వస్తాడని తెలుస్తోంది. అంటే మరో రెండు మూడు నెలల పాటు ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాదని క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ టాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని, ఇందులో మహేష్ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని ఎప్పటినుంచో చెబుతున్నారు. దాదాపు 8 క్యారెక్టర్స్‌లో మహేష్ కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది.