Guntur Kaaram Twitter Review : గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ ఇరగదీసిన మ‌హేష్ ఎలివేష‌న్స్‌

Byline :  saichand
Update: 2024-01-12 02:03 GMT

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అర్థరాత్రి నుండే థియేటర్లలో షోలు ప్రారంభమయ్యాయి.

ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించిన మహేష్ చూసి అభిమానులు థియోటర్లలో రచ్చ చేస్తున్నారు. సినిమా చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతూ సినిమా హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబుకు మరో బ్లాక్‌ బస్టర్ హిట్ అంటూ అంటున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబుది వన్‌ మ్యాన్ షో అంటూ ట్విట్టర్‌లో ఆయన మాస్ ఎంట్రీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. మహేష్‌ బాబు-వెన్నెల కిషోర్ కామెడీ సీన్ అదరహో అంటున్నారు. ఇక శ్రీలీల డ్యాన్స్‌తో ఇరగదీసిదంటూ.. ఇప్పటికే ట్రైలర్‌లో అదరగొట్టిన కుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్ బీజీఎమ్‌‌ను షేర్ చేస్తున్నారు. నెక్ట్స్‌ లెవెల్‌ సూపర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

తల్లీకొడుకుల అనుబంధంతో పక్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెట్స్‌తో ఈ మూవీని త్రివిక్రమ్ తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. శ్రీలీల‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ తల్లి పాత్రలో కనిపించింది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

Tags:    

Similar News