Guntur Karam leaked : లీకైన గుంటూరు కారం.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వాయిదాలు, గాసిప్స్ ను దాటుకుని ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మహేశ్ అభిమానులు. అంతేకాకుండా వచ్చే ప్రతీవార్తపై ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోయింది. కాగా ఈ సినిమా నుంచి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గుంటూరు కారం షూటింగ్ జరుగుతుంది. కోఠీ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, కాలేజీ స్టూడెంట్ పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు. షూటింగ్ స్పాట్ లో గాగుల్స్ పెట్టుకుని, మెట్లు దిగుకుంటూ వస్తున్న మహేశ్ బాబును చూసి అభిమానులు ఖుషీ అయ్యారు. దాన్ని వీడియో తీసి నెట్టింట్లో అప్ లోడ్ చేశారు. దాంతో క్షణాల్లో వీడియో వైరల్ అయింది.
Content unnodiki Cutout chaalu 🔥😎#GunturKaaram pic.twitter.com/befXqcDrGR
— Guntur Kaaram 🚬🔥 (@_ShyamReddyz) September 12, 2023