‘కుర్చీని మడతపెట్టి’ ఫుల్ సాంగ్ రిలీజ్.. థియేటర్స్లో ఇక పూనకాలు కన్ఫర్మ్
By : Bharath
Update: 2023-12-30 12:41 GMT
సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘కుర్చీ మడతపెట్టి..’ అంటూ సాగే పూర్తి లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సాంగ్ ప్రోమో విడుదల చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటకు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మాస్ బీట్ కు.. మహేశ్, శ్రీలీల స్టెప్పులకు.. థియేటర్స్ లో ఇక పూనకాలే అంటున్నారు.