సితార ఫస్ట్ కమర్షియల్‌ యాడ్‌..టైమ్‌ స్వ్కేర్‌పై బొమ్మ అదుర్స్

Update: 2023-07-04 07:06 GMT

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు లిటిల్ స్టార్ సితార గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. నెట్టింట్లో సితార చేసే సందడి మామూలుగా ఉండదు.  నాన్నతో సమానంగా సోషల్ మీడియాలో సితార పాపకు ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన స్టడీస్‌, ఆటలు, పాటలు, డ్యాన్సులు ఇలా ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. తన ఫాలోవర్స్‎ను ఇంప్రెస్ చేస్తుంటుంది. ఈ మధ్యనే సాయి పల్లవి పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసి అందరినీ అలరించింది సితార. పాప స్టెప్స్, డ్యాన్స్‎లో గ్రేస్ చూసిన నెటిజన్స్ త్వరలో మరో తార తెలుగు తెరకు పరిచయం అవుతుందని భావిస్తున్నారు. సినిమాల విషయం ఏమో కానీ సితార తొలిసారిగా ఓ కమర్షియల్‌ యాడ్‌ను చేసింది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజేకి బ్రాండ్ అంబాసిడర్‎గా వ్యవహరిస్తోంది సితార. ఈ సందర్భంగా ‘సితార కలెక్షన్స్‌’ పేరుతో న్యూయార్క్‌ సిటీలోని ఫేవస్ టైమ్‌ స్వ్కేర్‌పై ఆమె ఫోటోలను ఆవిష్కరించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.  ఇప్పటి వరకు సోషల్ మీడియాల్లో రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ చిల్ అయిన సితార మొదటిసారిగా జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‎గా వ్యవహరిస్తోంది.




 



ఈ క్రమంలో సితార కలెక్షన్స్‌ పేరుతో న్యూయార్క్‌ సిటీలోని ప్రఖ్యాత టైమ్‌ స్వ్కేర్‌పై ఆమె యాడ్‎ను ఆవిష్కరించారు. ఈ విషయాన్ని మహేశ్‌ సోషల్‌ మీడియా టీమ్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సితార యాడ్ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. లిటిల్‌ ప్రిన్సెస్‌‎ను న్యూయార్క్ టైమ్‌ స్వ్కేర్‌పై చూసి మహేశ్‌ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. స్టార్‌ కిడ్స్‌లో అతి చిన్నవయసులోనే సితార పాపకు దక్కిన గౌరవం ఇదని అభిమానులు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. 




 






 


Tags:    

Similar News