ఇంగ్లాండ్ బజ్‌బాల్‌ క్రికెట్‌పై మహేష్‌బాబు ట్వీట్

Update: 2023-06-17 13:41 GMT

యాషెస్‌ సిరీస్‌‌లో భాగంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. క్రికెట్ లోకాన్ని మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తూ తన బజ్‌బాల్‌ వ్యూహాన్ని ఇంగ్లాండ్ మరోసారి రూచి చూపెట్టింది. దూకుడు బ్యాటింగ్‌తో చెలరేగి మొదటి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసి సంచలనం సృష్టించింది. ఇంగ్లాండ్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరో మహేష్ బాబు సైతం ఇంగ్లాండ్ అనూహ్య నిర్ణయాన్ని కొనియాడాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు ఫ్రిన్స్.

‘‘393-8 డిక్లేర్డ్‌.. నేను ఇది సరిగ్గానే చదువుతున్నానా. వావ్‌.. జస్ట్‌ వావ్‌. క్రికెట్‌లో నవ శకానికి ఇదే నిదర్శనం.. బజ్‌బాల్‌’’అంటూ మహేబాబు ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఏకంగా మహేస్ ఇంగ్లాండ్ నిర్ణయాన్ని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. మహేష్ ట్వీట్‌తో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్‌పై అందరు దృష్టి మళ్ళింది.

యాషెస్‌ సిరీస్‌ మొదటి టెస్ట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్‌ చేసింది. జో రూట్‌ (118 నాటౌట్‌; 152 బంతుల్లో 7×4, 4×6) సెంచరీతో చెలరేగాడు. జాక్ క్రాలీ 61, బెయిర్ స్టో 78 పరుగులుతో రాణించారు. ఇంగ్లాండ్ డిక్లేర్డ్ అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ప్రస్తుతానికి 38 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ఖవాజా (51 నాటౌట్) ఆదుకున్నాడు. హెడ్‌(23)తో కలిసి ఇన్సింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.


ఏంటీ ‘బజ్‎బాల్’

టెస్ట్ క్రికెట్‌లో వన్డే తరహా బ్యాటింగ్ చేయడమే ‘బజ్‎బాల్’ వ్యూహం. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ కొత్త శకానికి ‘బజ్‎బాల్’ ద్వారా నాంది పలికింది. టెస్టు క్రికెట్ మీద ఆసక్తిని తగ్గించుకుండే ఉండేందుకు గత కొంతకాలంగా ‘బజ్‎బాల్’ వ్యూహాన్ని అమలు చేస్తూ ఫలితాలను రాబడుతోంది. 5కి పైగా రన్ రేట్ తో పరుగులు చేస్తు ప్రత్యర్థులు ఆత్మరక్షణలో పడేస్తోంది. ఇంగ్లాండ్ కోచ్ మెక్ కల్లం, కెప్టెన్ స్టోక్స్ లు ఈ వ్యూహాన్ని పక్కగా అమలు చేస్తున్నారు.


Tags:    

Similar News