Hanu Man Movie : వీకెండ్లో కిక్కిచ్చే న్యూస్.. హనుమాన్ మూవీ టికెట్లపై భారీ ఆఫర్

Byline :  Bharath
Update: 2024-02-17 06:52 GMT

సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలవడం విశేషం. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా.. మూడు వారాల్లోనే సుమారు రూ.300 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ అధికారికంగా ట్విట్టర్​లో షేర్​ చేసింది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా.. ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుండటంతో... మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.




 


థియేటర్ ఆడియన్స్ కు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. నైజాం థియేటర్స్ లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ ధర రూ.175 ఉంది. ఈ టికెట్ ధరను రూ. 100కు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే మల్టీప్లెక్స్ లో రూ.295 ఉండగా.. రూ.150కి తగ్గించారు. అయితే తగ్గించిన ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23వ తేదీ వరకే అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.





Tags:    

Similar News