BRO టీజర్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్

Update: 2023-06-29 14:17 GMT

సముద్రఖని డైరెక్షన్ లో వపర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO). తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’ అంటూ పవన్ చెప్పే డైలాగ్.. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పోస్టర్లు అభిమానుల్లో హైప్ ను పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ దాన్ని డబుల్ చేస్తోంది.




 


ఈ టీజర్ లో పవన్, తేజ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’కు రీమేక్ గా బ్రో సినిమాను తెరకెక్కించారు. ముహూర్తం ప్రకారం ఇవాళ సాయంత్రం 5:04కు టీజర్ విడుదల కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. దాంతో సాయంత్ర 6:45కు విడుదల చేశారు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Full View






Tags:    

Similar News