అక్కాతమ్ముళ్ల మధ్య విభేదాలు..అందుకే రాఖీ కట్టలేదా?

Byline :  Aruna
Update: 2023-09-01 14:29 GMT

మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని గత కొంత కాలంగా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదంతా ఏమీ లేదని మేమంతా బాగానే ఉన్నామని వాళ్లు చెప్తున్నా ఎక్కడో అక్కడ కాస్త తేడాగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో మంచు కుటుంబంలో గొడవలు, డిస్టబెన్స్‌ ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన ఓ ఫోటో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారంతా అసలు మ్యాటర్ ఏమిటని ఆరా తీయడం మొదలుపెట్టారు.

అప్పట్లో మంచు విష్ణు, మనోజ్‌ అనుచరుడితో వాగ్వాదానికి దిగిన వీడియో రిలీజ్ అయ్యింది. ఈ వీడియో సంచలనంగా మారింది. దీంతో విష్ణుకి, మనోజ్ కి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయని పుకార్లు షికారు చేశాయి. అందుకు తగ్గట్లే మనోజ్‌ పెళ్లిలో విష్ణు కుటుంబం సందడి కనిపించకపోవడంతో దాదాపు అది నిజమేనని కన్ఫార్మ్ అయిపోయారు. పెళ్లి సమయంలో విష్ణు కుటుంబం చుట్టపుచూపుగా వచ్చి నాలుగు అక్షింతలు వేసి వెళ్లిపోయారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ మంచు లక్ష్మి మాత్రం తన తమ్ముడి పెళ్లిని దగ్గరుండి మరీ భుజాన వేసుకుని అంగరంగ వైభవంగా జరిపించింది. ఈ సంఘటనలు చూసిన వారంతా మంచు ఫ్యామిలీలో సఖ్యత లోపించిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఇప్పుడు మంచు లక్ష్మి షేర్‌ చేసిన ఫోటో కూడా మరోసారి ఈ చర్చలకు ఆజ్యం పోసింది.

రాఖీ పండుగ సందర్భంగా మంచు లక్ష్మీ తన సోదరుడు మనోజ్‌కు రాఖీ కట్టి వారితో ఓ రెస్టారెంట్‌లో లంచ్‌ చేసింది. ఈ ఫోటోలను తన ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేసింది.'ప్రేమతో సరదాగా సమయాన్ని గడిపి రుచికరమైన భోజనం చేసి రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లు ఓ క్యాప్షన్‏ను ఈ ఫోటోలకు జోడించింది. అయితే ఈ ఫోటోల్లో మాత్రం పెద్ద తమ్ముడు మంచు విష్ణు కనిపించలేదు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ అంతా బానే ఉంది.. కానీ, మంచు విష్ణు ఎక్కడ? అని అడుగుతున్నారు. విష్ణుకు రాఖీ కట్టలేదా? అని క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో అక్కాతమ్ముళ్లకు మధ్య ఏం జరిగింది. వీరి మధ్య దూరం రోజు రోజుకు పెరుగుతోందని అనుమానిస్తున్నారు.



Tags:    

Similar News