రూ.100 కోట్ల బడ్జెట్తో మంచు విష్ణు సినిమా.. ఈసారి హిట్ పక్కా..?
వరుస ప్లాప్ లు ఎదుర్కొంటున్న ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ‘కన్నప్ప’ (భక్త కన్నప్ప) సినిమాను తెరకెక్కించబోతున్నారు. గతంలో జిన్నా సినిమాతో వచ్చినా.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. శుక్రవారం (ఆగస్టు 18) లాంఛనంగా శ్రీకాళహస్తిలో పూజాకార్యక్రమాలు ప్రారంభించారు. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథపై పనిచేస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హిందోలో మహాభారత్ సీరియల్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు సరసన నుపూర్ సనన్ నటిస్తోంది.
పూజా కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు ‘భారీ బడ్జెట్ తో, అత్యంత అధునాతన సాంకేతికతతో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాం. కన్నప్ప భక్తిని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా షూటింగ్ పూర్తవుతుంది. చిత్త పరిశ్రమలో ఉన్న గొప్ప నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామ’ని అన్నాడు. కాగా ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ తదితరులు పనిచేస్తున్నారు.