పవన్ కల్యాణ్‎పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

Update: 2023-08-17 09:35 GMT

ఏపీ సీఎం జగన్‌ పాలనను హీరో మంచు విష్ణు కొనియాడారు. ఏపీలో నవరత్నాలు ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని తెలిపాడు. సర్వేలు కూడా సీఎం జగన్‌కు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్న వార్తలో నిజం లేదని హీరో మంచు విష్ణు స్పష్టం చేశారు.

ఓ యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాల గురించి మాత్రం తాను చెప్పలేనని మంచు విష్ణు అన్నారు. ఓటు వేసే విషయంలో ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచిస్తారన్న ఆయన...నచ్చిన వాళ్ల సినిమా వస్తే చూస్తారని, కానీ ఓటేయాలని అనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారని తెలిపారు. సినిమా రంగంలో మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారని..పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారినా అని వ్యాఖ్యానించారు. పవన్ రాజకీయాలు గురించి పక్కనబెడితే..సినిమా ఇండస్ట్రీలో మాత్రం సూపర్ స్టార్ అన్నారు. పవన్‌కు సంబంధించి ఒక సినిమా ఆడకపోయినా మరో సినిమాలో రెట్టింపు కలెక్షన్స్ వస్తాయని మంచు విష్ణు తెలిపాడు.

మంచు ఫ్యామిలీ పొలిటికల్ ఎంట్రీపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ సపోర్ట్ చేసిన మోహన్ బాబు తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇటీవల మంచు మనోజ్ దంపతులు చంద్రబాబు నాయుడును కలవగా..మంచు విష్ణు మాత్రం జగన్‌‎కు జై కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మనోజ్, విష్ణు మధ్య విభేదాలు బయటపడగా అవి రాజకీయంగానూ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.    


Tags:    

Similar News