Mangalavaram Movie Trailer: మంగళవారం హత్యల వెనక ఉన్నది ఎవరు..?
ఆర్ఎక్స్ 100తో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ నేపథ్యంలో ఇప్పటివరకూ తెలుగులో ఏ సినిమా రాకపోవడంతో క్లాసిక్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. దీంతో దర్శకుడు అజయ్ భూపతి పేరు మార్మోగిపోయింది. వెంటనే ఎన్నో ఆఫర్స్ వచ్చినా అతను మాత్రం తను అనుకున్న మహా సముద్రమే తీయాలనుకుని గ్యాప్ తీసుకుని మరీ భంగపడ్డాడు. మహా సముద్రం డిజాస్టర్ అయింది. ఈ కారణంగా అతనిపై ఎన్నో సెటైర్స్ కూడా పడ్డాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా మరోసారి తనదైన శైలిలో మంగళవారం అనే సినిమాతో రాబోతున్నాడు. Mangalavaram movie trailer out
మంగళవారం మూవీ టైటిల్ నుంచి ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు ఆల్రెడీ విడుదలైన రెండు పాటలూ ఆకట్టుకున్నాయి. అజయ్ ఒక కొత్త నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నాడనేది ఇప్పటికే అర్థమైంది. అయితే ట్రైలర్ మాత్రం నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ తో పాటు కాస్త లస్ట్ కూడా తోడైన కథలా ఉందీ మూవీ. ప్రతి మంగళవారం అక్రమం సంబంధం పెట్టుకున్నవాళ్లు హత్యకు గురవుతుంటారు. అవి చేస్తున్నది ఎవరు అనే సస్పెన్స్ తో ఆద్యంతం కట్టిపడేసేలా ఉందీ ట్రైలర్. పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ తర్వాత మరో స్థాయికి వెళ్లింది. సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్నా.. అంతకు మించిన సోషల్ ఇష్యూ ఏదో డిస్కష్ చేసినట్టుగానూ ఉన్నాడు అజయ్ భూపతి.
ఈ ట్రైలర్ లో ప్రధానంగా ఆకట్టుకుంది అజయ్ టేకింగ్. ఎక్స్ ల్లెంట్ టేకింగ్. ఒక్కో షాట్ మాస్టర్ పీస్ లా ఉంది. అయితే అక్కడక్కడా కాంతార, విరూపాక్ష తరహా టేకింగ్ కూడా కనిపించడం విశేషం. మరో విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలకూ సంగీతం అందించిన అజనీష్ లోకనాథే ఈ చిత్రానికి మ్యూజీషియన్. అందుకే సంగీతంలోనూ ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇలాంటి కథలకు పోలికలు సహజమే. కాకపోతే ఆ టేకింగ్ ఈ కథకు సరిగ్గా సరిపోయేలా ఉంటే ఓకే. లేదంటే ఆ సినిమాల్లా ఉండాలని అనుకరిస్తే సమస్య తప్పదు. మొత్తంగా నవంబర్ 17న ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. భారీ తారాగణం కనిపిస్తున్నా.. ఎవరూ స్టార్స్ కాదు. ఒక గ్రామానికి మాత్రమే చెందిన కథలా కనిపిస్తున్నా.. ఒక యూనిక్ కంటెంట్ ను డిస్కస్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ మూడో సినిమాతో అజయ్ భూపతి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో కానీ.. ఈ ట్రైలర్ లోని టేకింగ్ చూస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయని చెప్పొచ్చు.