మైక్ మూవీస్ పతాకంపై సరికొత్త కథతో, అద్భుత కథనంతో రూపొందిన చిత్రం ‘మట్టికథ’. ఈ మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ ఆదివారం(జూన్ 4) విడుదల చేయనున్నారు. పవన్ కడియాల దర్శకత్వం వహించిన ఈ మూవీని అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. సహనిర్మాత సతీశ్ మంజీర. అజయ్ వేద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ జానపద గాయని కనకవ్వ, ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించగా కుంభం ఉదయ్ ఎడిట్ చేశారు. మైక్ మూవీస్ పతాకంపై వచ్చిన ‘జార్జిరెడ్డి’, ‘ప్రెజర్ కుకర్’ విడుదలై ప్రజాదరణ పొందాయి. ‘స్లమ్‌డాగ్ హజ్సెండ్’తోపాటు, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా రూపొందిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.