Matti Katha Movie : రేపే మట్టి కథ రిలీజ్..

Byline :  Krishna
Update: 2023-09-21 11:12 GMT

ప్రస్తుతం టాలీవుడ్ రియాలిటీకి పట్టడం కడుతోంది. ఇంతవరకు సెల్యూలాయిడ్‌పై కనిపించని ముడిజీవితపు కథలను కొత్త దర్శకులు తెరపై సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ‘మట్టికథ’ చిత్రం అటువంటిదే. వినూత్న కథాకథనాలతో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది.

పల్లెటూరి కుర్రాడి తన కలలను నెరవేర్చుకోవడానికి పడిన తిప్పలను, భూమితో అనుబంబంధం, పల్లె సరదాలు, కష్టాలు, ఆత్మీయత వంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ట్రైలర్లో ‘‘అన్నంపెట్టే పొలాన్ని అమ్ముకుంటే ఎట్టా బిడ్డా?’, ‘అంత పెద్ద రజాకార్ల దాడప్పడే మేం ఊరు ఇడ్సి పోలేదు, ఇంత ముత్తెమంత దానికే పరేషానయిత్తువు’’ వంటి భావోద్వేగమైన డైలాగులతోపాటు, ఆకట్టుకున్నాయి.

విడుదల కాకముందే ఈ మూవీ అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇండో-ఫ్రెంచ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ మూవీకి తొమ్మిది అవార్డులు వచ్చాయి. ఈ సనిమాని పవన్ కడియాల దర్శకత్వం వహించగా.. మైక్ మూవీస్ బ్యానర్పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. సతీష్ మంజీర సహనిర్మాతగా వ్యవహరించారు. అజయ్ వేడ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ జానపద గాయని కనకవ్వ, ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు.


Full View


 


Tags:    

Similar News