Padma mohana Awards 2023:మట్టి మనుషుల ‘‘మట్టికథ’’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

Byline :  Bharath
Update: 2024-01-24 16:31 GMT

తెలుగు సినీ పరిశ్రమలో పల్లె, గ్రామీణ నేపథ్యంలో సినిమాలో బాగానే తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాస, భాషలతో చాలా సినిమాలు రిలీజై.. హిట్ కొట్టాయి. ఆ లిస్ట్లోనే చేరుతుంది మట్టికథ సినిమా కూడా. పల్లెటూరు కుర్రాడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి.. మట్టిలోని మధునానుభూతి ఎలా ఉంటుందనేలా కళ్లకు కట్టిన సినిమా ఇది. మనకందరికీ తెలిసిన, మనం మరచిపోతున్న ‘మట్టి కథ’ను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. పవన్ కడియాల డైరెక్షన్ లో అజయ్ వేద్ హీరోగా వచ్చిన ఈ సినిమాను.. మైక్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్, ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి నిర్మించారు. అద్భుతమైన కథ, ఆలోచింపజేసే కథనాలతో వచ్చిన ఈ సినిమా.. థియేటర్స్, ఓటీటీ (ఆహా)లో విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమా కథ సహజత్వానికి దగ్గరగా ఉందని, తెలంగాణ పల్లెల్లోని ఆప్యాయతను, అనురాగాన్ని, స్వచ్ఛతను తెలియజేసిందని.. సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. భూమితో పల్లె మనుషులకు ఉండే అనుబంధాన్ని సినిమాలో చూపించిన తీరుకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కాగా మట్టికథ చిత్రం విడుదలకు ముందే తొమ్మిది అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఇండో-ఫ్రెంచ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పలు విభాగాల్లో తొమ్మిది అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఇండియన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ యాక్టర్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, డెబ్యూ ఫిల్మ్‌ మేకర్‌ ఆఫ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ తదితర కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. తాజాగా మరో అవార్డ్ ను మట్టికథ సొంతం చేసుకుంది. పద్మ మోహన టీవీ అవార్డ్స్ 2023లో ‘బెస్ట్ మూవీ’ కేటగిరీలో అవార్డ్ లభించింది. జనవరి 31వ తేదీన సాయంత్రం 5 గంటలకు.. శిల్పకళావేదికలో ఈ అవార్డ్ ప్రధానోత్సవం జరగనుంది. కాగా అవార్డ్ ఎంపికైనందున చిత్ర బృందానికి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News