Matti Katha Movie OTT : ఓటీటీలోకి మట్టికథ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
అచ్చమైన పల్లె సినిమా మట్టికథ ఇటీవల రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. మట్టికథ మనసుకు హత్తుకునే కథ అంటూ థియేటర్స్లో చూసిన ఆడియన్స్ చెప్పడం ఈ సినిమా నిజమైన గెలుపు. తెలంగాణ సంస్కృతి, మానవ బంధాల పరిమళాన్ని, పల్లెల్లో ప్రజల జీవిన విధానాన్ని, భూమే ప్రాణంగా, వ్యవసాయమే జీవనాధారంగా బతికే ప్రజల భావోద్వేగాలను స్పష్టంగా చూపించింది ఈ సినిమా. తమకు కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
మట్టికథ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్ట్రీమింగ్ డేట్ ను ఆ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్లో ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఆడిన అన్నీ థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కన్పించాయి. విడుదలకు ఈ మూవీ అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇండో - ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 9 అవార్డులతో వారెవ్వా అనిపించింది.
ఇక ఈ మూవీని పవన్ కడియాల డైరెక్ట్ చేయగా.. మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి నిర్మించారు. సతీశ్ మంజీర సహనిర్మాతగా వ్యవహరించగా.. స్మరణ్ సాయి అదిరిపోయే సంగీతం అందించారు. ఈ మూవీ మ్యూజిక్ మనసుకు హత్తుకుంటుంది. పవన్ కడియాల తొలి చిత్రమే అయినా చాలా రియలిస్టిక్‌గా అనుభవమున్న వ్యక్తిలా కథను మలిచారు. అజయ్ వేద్, అక్షయ్ సాయి, రాజు ఆలూరి, బత్తుల తేజ, బల్వీర్ సింగ్, మాయ, రుచిత నిహాని, కనకవ్వ, బలగం సుధాకర్ రెడ్డి, దయానంద్ తమ సహజ నటనతో అదరగొట్టారు. సినిమా అంటే కమర్షియల్ అనే భావనకు వెళ్లకుండా రియాలిటీగా దగ్గరగా మట్టికథను తీసి తక్కువ బడ్జెట్‌లో ది బెస్ట్ మూవీ అందించారు మేకర్స్ను ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు.
A Captivating Journey of Pure Simplicity… Immerse Yourself in the Magic. Watch #MattiKathaOnAHA from October 13. @Appireddya @ajeyved @Mic_Movies @Mictvdigital @smaransai @Pa1Kadiyala pic.twitter.com/exZUi6lf3K
— ahavideoin (@ahavideoIN) October 6, 2023